కోడి పందాలు ఆడుతున్న 12 మంది అరెస్ట్

కాగజ్ నగర్, వెలుగు: సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహిస్తున్న స్థావరాలపై కౌటాల, చింతలమానేపల్లి పోలీసులు  దాడులు చేసి 12 మందిని పట్టుకున్నారు. కౌటాల పోలీస్ స్టేషన్ పరిధి జనగాంలోని పల్లె ప్రకృతి వనం దగ్గర కోడి పందాలు ఆడుతున్నారన్న సమాచారంతో ఎస్ఐ మధుకర్ మంగళవారం సిబ్బందితో దాడి చేసి 9 మందిని పట్టుకున్నారు. కారే మహేశ్, బీవంకర్ చందు, ఉర్కుడే సంతోష్, కోవా పుల్లికరావు, వేములవాడ సత్యన్న,పాండురంగ్, వడై రవీందర్, సోన్లే భీంరావు, జాడే తిరుపతిని  అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.3,900, 3 పుంజులు, 3 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. చింతల మానేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రణవెల్లి సమీపంలో కోడి పందాలు ఆడుతున్న ముగ్గురితో పాటు మూడు బైక్ లు,రూ.1550 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు.