రెండుగా విడిపోయిన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్..భయాందోళనలో ప్రయాణికులు

రెండుగా విడిపోయిన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్..భయాందోళనలో ప్రయాణికులు

శ్రీకాకుళం జిల్లా పలాసలో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం తప్పింది.  సికింద్రాబాద్ నుంచి  హౌరాకు వెళ్తున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్  ట్రైన్ నుంచి  బోగీలు విడిపోయాయి. మందస, సున్నాదేవీ మధ్యలో ట్రైన్ నుంచి బోగీలు విడిపోయాయి. దీంతో బోగీల్లో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు

12 బోగీలు ఇంజిన్ తో ముందుకెళ్లింది ఎక్స్ ప్రెస్. ఈ విషయం తెలియడంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు మందస స్టేషన్ దగ్గర రైలును నిలిపివేశారు. విడిపోయిన బోగీలను కలిపేందుకు సిబ్బంది యత్నిస్తున్నారు. బోగీల మధ్య ఉండే కప్లింగ్ ఊడిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు అధికారులు.   ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.