సుప్రీం కోర్టు సిబ్బంది కోసం సూపర్ హిట్ సినిమా స్పెషల్ షో.

సుప్రీం కోర్టు సిబ్బంది కోసం సూపర్ హిట్ సినిమా స్పెషల్ షో.

మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకాదరణ పొందుతుంటాయి. అయితే గత ఏడాది బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన 12 ఫెయిల్ చిత్రం కూడా ఈ కోవకే చెందుతుందని చెప్పవచ్చు. అయితే 12 ఫెయిల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయ్యింది. అంతేగాకుండా పలు అవార్డులు రివార్డులు కూడా అందుకుంది. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించిన విక్రాంత్, మేధ శంకర్ తమ అద్భుతమైన నటనా తీరుతో ఆకట్టుకున్నారు. 

పలువురు సినీ సెలెబ్రెటీలు సైతం ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. కాగా ఈ చిత్రాన్ని ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఇందులోభాగంగా ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన యువకుడు ఐపీఎస్ అధికారి ఎలా అయ్యాడు, ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు, తనని ప్రేమించిన ప్రియురాలు ఎలా ప్రోత్సహించింది అనే విషయాలు చక్కగా తెరమీద చూపించారు. దీంతో ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. 

ALSO READ | ఫ్యామిలీతో కలసి దేవర చిత్రాన్ని చుసిన జక్కన్న.

అయితే ఇటీవలే  సుప్రీం కోర్టు సిబ్బంది కోసం  12 ఫెయిల్ చిత్రాన్ని స్పెషల్ షో వేశారు. దీంతో సుప్రీం కోర్టు సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలసి దాదాపుగా 600 మంది ఈ చిత్రాన్ని చూసి చిత్ర యూనిట్ ని అభినందించారు. అంతేగాకుండా ఇలాంటి చిత్రాలు సమాజానికి ఎంతో అవసరమని వీటివలన విద్యార్థులు కూడా మంచి విషయాలు తెలుసుకుంటారని తెలిపారు.