
అనకాపల్లి జిల్లాలో భారీ కింగ్ కోబ్రా హల్‌చల్ చేసింది. చీడికాడ మండలం కోనాంలోని పంట పొలాల్లో ఏకంగా 12 అడుగుల గిరినాకు జనాలను పరుగులు పెట్టించింది. పొలం పనుల కోసం ఉదయాన్నే వెళ్లిన స్థానిక రైతులకు బుసలు కొడుతున్న కింగ్ కోబ్రాను కనిపించింది. దీంతో వారు అక్కడినుంచి భయంతో పరుగులు తీశారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగి గిరినాగును బంధించేందుకు ప్రయత్ని్ంచారు.
చివరకు చాలాసేపు శ్రమించి దానిని ఎట్టకేలకు బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో రైతులు, స్థానికులు ఊపిరితీసుకున్నారు. వరుసగా కింగ్ కోబ్రాలు ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. ఇటీవల అనకాపల్లితో పాటూ మరికొన్ని ప్రాంతాల్లో ఈ మధ్య కింగ్ కోబ్రాలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో అటవీ అధికారులు వెంటనే స్పందించి ఈ పాములను పట్టుకుని దూర ప్రాంతాల్లో విడిచి పెట్టాలని వారు కోరుతున్నారు.