
తిరుమలలో కొండచిలువ కలకలం రేపింది. మంగళవారం పాపవినాశనం మార్గంలోని డ్రైనేజీ శుద్ధి ప్లాంటు వద్ద సిబ్బందికి 12 అడుగుల కొండచిలువ కనపడింది. సిబ్బంది హడలిపోయి, భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న టీటీడీ అటవీశాఖ రిటైర్డ్ మజ్దూర్ భాస్కర్ నాయుడు అక్కడి చేరుకున్నారు. కొండచిలువను పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.