తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సర్వ దర్శనం కోసం 11 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. టైం స్లాట్ దర్శనానికి 5 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ తెలిపింది.  నిన్న తిరుమల శ్రీవారిని 74 వేల412 మంది భక్తులు దర్శించుకోగా,  27,636 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. 

ఇక స్వామి వారి హుండీ ఆదాయం 4 కోట్ల 27 లక్షలు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఏపీ మంత్రి రోజా తిరుమలను దర్శించుకున్నారు. పుట్టిన రోజు సందర్భంగా ఆమె శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. స్వామివారి  దివ్యరూపం ఎన్నిసార్లు చూసిన మర్చిపోలేనిదన్నారు.