పనామా నుంచి ఫస్ట్ బ్యాచ్.. ఢిల్లీ చేరుకున్న 12మంది భారతీయ వలసదారులు

పనామా నుంచి ఫస్ట్ బ్యాచ్.. ఢిల్లీ చేరుకున్న 12మంది భారతీయ వలసదారులు

అమెరికాలోని భారతీయ వలసదారులతో పనామానుంచి తొలి ఫ్లైట్ ఇండియాకు చేరుకుంది. అమెరికా నుంచి పనామాకు బహిష్కరించబడిన 12 మంది భారతీయ పౌరులు న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఆదివారం(ఫిబ్రవరి 23) సాయంత్రం వలసదారులతో పనామా నుండి టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇస్తాంబుల్ మీదుగా న్యూఢిల్లీకి చేరుకుంది. మొదటి బ్యాచ్ గా 12 మంది న్యూఢిల్లీ చేరుకున్నారు. వీరిలో నలుగరు పంజాబ్ కు చెందినవారు. అమెరికా బహిష్కరించగా సుమారు 299 మంది భార తీయ వలసదారులు పనామాలో ఉన్నారు. 

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక వలసలపై దృష్టిపెట్టిన విషయం తెలిసిందే.అమెరికాలో ప్రవేశించిన లక్షలాది మంది వలసదారులను బహిష్కరిస్తామని ట్రంప్ ప్రతిజ్ణ చేశారు. ఇందులోభాగంగా వలసదారులను  గుర్తించి వారి సొంత దేశాలకు పంపిస్తున్నారు. అమెరికా ఇప్పటికే మూడు గ్రుపులుగా భారతీయులను మొత్తం 332 మందిని భారతదేశానికి పంపించింది. అయితే ప్రస్తుతం పనామాలో ఉన్న 299 మంది పత్రాలు లేని వలసదారుల్లో 171 మంది మాత్రమే స్వదేశానికి తిరిగి రావడానికి అంగీకరించారు.