తెలంగాణలో 12 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ

తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 12 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత రాచకొండ పోలీస్ కమిషనర్ జి.సుధీర్ బాబును మల్టీజోన్ ఐజిపిగా నియమించగా.. కొత్త సీపీగా తరుణ్‌జోషికి బాధ్యతలు అప్పగించింది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బదిలీలు పాధాన్యతను సంతరించుకున్నాయి.

Also Read: లిఫ్ట్ పేరుతో వృద్ధురాలి నుంచి బంగారు గొలుసు దోచుకున్న దొంగలు

 బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు వీరే

  • రాచకొండ పోలీస్ కమిషనర్‍గా తరుణ్ జోషి
  • రామగుండం కమిషనర్‌గా ఎం. శ్రీనివాసులు
  • మల్టీజోన్ ఐజిపిగా జి. సుధీర్ బాబు
  • జోగులాంబ డీఐజీగా ఎల్.ఎస్. చౌహన్
  • సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌గా జోయల్‌ డేవిస్‌
  • సీఐడీ డీఐజీగా నారాయణ్‌ నాయక్‌
  • టీఎస్‌ఆర్టీసీ విజిలెన్స్‌ ఎస్పీగా కే. అపూర్వ రావ్‌
  • సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా డి. ఉదయ్ కుమార్ రెడ్డి
  • ఈస్ట్ జోన్ డీసీపీగా ఆర్. గిరిధర్
  • తెలంగాణ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా డి. మురళీధర్
  • హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా సాధన రష్ని పెరుమాళ్ 
  • డి. నవీన్ కుమార్‌ను డీజీపీ ఆఫీస్ కు అటాచ్