
పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా హైదరాబాద్ కు గంజాయి తరలింపు ఆగటం లేదు. వివిధ రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తూ లక్షల విలువలైన గంజాయి పట్టుబడుతూనే ఉంది. శుక్రవారం ఉదయం కోనార్క్ ఎక్స్ ప్రెస్ లో అక్రమంగా గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు దుండగులు.
రోజూవారి తనిఖీల్లో భాగంగా కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలులో గంజాయి తో ఉన్న బ్యాగును గుర్తించారు రైల్వే పోలీసులు. ఎవరికీ డౌట్ రాకుండా లగేజ్ బ్యాగులో లగ్జరీగా గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ బ్యాగులో 6 లక్షల రూపాయల విలువచేసే గంజాయిని పట్టుకున్నారు. మొత్తం 13 ప్యాకెట్లలో 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగును ఎవరు పెట్టారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు రైల్వే పోలీసులు.