- 15 తులాల గోల్డ్, 30 తులాల వెండి, రూ.1.50 లక్షల నగదు అపహరణ
సూర్యాపేట, వెలుగు : ఓ ఇంట్లో దొంగలు చొరబడి రూ.12 లక్షల విలువైన బంగారం, వెండితోపాటు నగదు ఎత్తుకెళ్లిన ఘటన మిర్యాలగూడ పట్టణంలోని కృష్ణా మానస కాలనీలో మంగళవారం జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం.. కృష్ణమానస కాలనీకి చెందిన పందిరి వేణు ఈనెల 5న ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి తిరుపతికి వెళ్లారు. తిరిగి మంగళవారం ఉదయం ఇంటికి చేరుకున్నారు.
ఇంటి మెయిన్ డోర్, బెడ్రూం గది తలుపులకు వేసిన తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించాడు. బీరువాలోని 15 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.1.50 లక్షల నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని గ్రహించి పోలీసులకు సమాచారం అందజేశాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితుడి మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ లోకేశ్తెలిపారు.