కోదాడలో రూ.12లక్షల మెడిసిన్‌ సీజ్

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడలో పలు మెడికల్‌ షాపులు, ఆసుపత్రుల్లో డ్రగ్స్‌ కంట్రోల్ అధికారుల మార్చి 11 సోమవారం రోజున సోదాలు నిర్వహించారు.  పట్టణంలో కార్పొరేట్ స్థాయిలో ఉన్న సురేష్ ఆర్థోపెడిక్  హాస్పిటల్ లో రూ.12.40 లక్షల విలువైన మెడిసిన్‌ ను అధికారులు సీజ్‌ చేశారు.  ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందులు, క్రీ బ్యాండేజ్ లను విక్రయిస్తున్నట్లుగా డ్రగ్స్ అధికారులు గుర్తించారు.  మందుల గోడౌన్ లో  లైసెన్స్ లేకుండా అక్రమంగా నడుపుతున్నట్లు సోదాల్లో వెల్లడైంది.  దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో  వెల్లడిస్తామని  విజులెన్స్ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు.  

Also Read :కాంగ్రెస్దే కుటుంబ పాలన , కుటుంబాల వ్యవస్థ