పెషావర్: పాకిస్తాన్‌లో కొండచరియలు విరిగిపడి ఒకే ఫ్యామిలీకి చెందిన 12 మంది మృతి చెందారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని అప్పర్ డిర్ జిల్లాలోని మైదాన్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. శిథిలాల కింది నుంచి డెడ్‌బాడీలను వెలికితీసి, పోస్ట్‌మార్టం కోసం హాస్పిటల్‌కు తరలించామన్నారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తితో పాటు 9 మంది చిన్నారులు చనిపోయారని చెప్పారు. కాగా, దేశంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని, వచ్చే 24 గంటల్లో కూడా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పాక్ వాతావరణ శాఖ తెలిపింది.