తెలంగాణ హైకోర్టుకు 12మంది కొత్త జడ్జిలు

తెలంగాణ హైకోర్టుకు 12మంది కొత్త జడ్జిలు
  • కొత్త జడ్జీల్లో ఏడుగురు న్యాయవాదులు
  • చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు

న్యూఢిల్లీ: తెలంగాణకు 12 మంది కొత్త జడ్జీలు రానున్నారు. నిన్న మంగళవారం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమై తెలంగాణ హైకోర్టుకు 12 మంది కొత్త జడ్జీలను సిఫారసు చేసింది. వీరిలో ఏడుగురు న్యాయవాదుల పేర్లను న్యాయమూర్తులుగా సిఫారసు చేసింది. 
కొత్త జడ్జీలు:
జి.అనుపమ చక్రవర్తి
ఎం.జి.ప్రియదర్శిని
సాంబశివరావు నాయుడు
ఎ.సంతోష్ రెడ్డి 

జడ్జీలుగా రానున్న న్యాయవాదులు
కాసోజు సురేందర్‌
చాడ విజయ్‌ భాస్కర్‌రెడ్డి
సూరేపల్లి నందా
ముమ్మినేని సుధీర్‌ కుమార్,
‌జువ్వాడి శ్రీదేవి
మీర్జా సైఫీయుల్లా బేగ్‌
నాచరాజు శ్రవణ్‌, కుమార్ వెంకట్.