కరాచీ: పాక్లో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ట్రక్కును బస్సు ఢీకొట్టడంతో 12 మంది చనిపోయారు. పెళ్లి బృందంతో బస్సు హైదరాబాద్ నుంచి బయలుదేరింది. దక్షిణ సింధ్ ప్రావిన్స్ లోని మోరో సమీపంలోకి రాగానే ట్రక్కును ఢీకొట్టింది.
బస్సులో 20 మంది ఉండగా12 మంది మరణించారు. మృతుల్లో 8 మంది ప్రముఖ డాక్టర్ కుటుంబానికి చెందిన వారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని మోరో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ తెలిపారు. మెరుగైన చికిత్స కోసం వారిని నవాబ్ షా, కరాచీకి తీసుకెళ్లామని చెప్పారు. ట్రక్కు డ్రైవర్ ఘటన స్థలం నుంచి పరారయ్యాడని అధికారులు పేర్కొన్నారు.