చైనాలో వరదబీభత్సం.. బ్రిడ్జి కూలి 12 మంది మృతి

చైనాలో వరదబీభత్సం.. బ్రిడ్జి కూలి 12 మంది మృతి
  • చైనాలో బ్రిడ్జి కూలి 12 మంది మృతి
  • 60 మందికి పైగా గల్లంతు
  • ఆకస్మిక వరదలతో ప్రమాదం

బీజింగ్: చైనాలో ఆకస్మిక వరదల కారణంగా శుక్రవారం షాంగ్సీ, సిచువాన్ ప్రావిన్స్‌‌ లో బ్రిడ్జి కూలిపోయింది. దీంతో 12 మంది మృతి చెందారు. మరో 60 మందికి పైగా గల్లంతైనట్టు అధికారులు శనివారం తెలిపారు. వాయువ్య షాంగ్సీ ప్రావిన్స్‌‌లో కొద్దిరోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరద కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో షాంగ్లూ సిటీ జాషుయ్ కౌంటీలోని ఈ బ్రిడ్జి ఆకస్మిక వరదల వల్ల పాక్షికంగా కూలిపోయింది. 

దీంతో 17 కార్లు, 8 ట్రక్కులు వంతెన దిగువన ఉన్న జింకియాన్ నదిలో పడిపోయాయి. అందులో 7 వాహనాలను రెస్క్యూ అధికారులు బయటకు తీశారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్​ కొనసాగుతోంది. ఓ వ్యక్తిని రక్షించామని, ఇప్పటి వరకు 12 మృతదేహాలను వెలికితీశామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. శనివారం తెల్లవారుజామున 2:30 గంటలకు సిచువాన్ ప్రావిన్స్‌‌లోని జిన్‌‌హువా గ్రామాన్ని ఆకస్మిక వరదలు 
ముంచెత్తడంతో 30 మందికి పైగా గల్లంతయ్యారని స్థానిక అధికారులు తెలిపారు.