కుక్కల దాడిలో 12 గొర్రెలు మృతి

నల్గొండ అర్బన్(తిప్పర్తి), వెలుగు : గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో 12 గొర్రెలు మృతి చెందాయి. బాధితుడి   వివరాల ప్రకారం..  తిప్పర్తి మండలం ఎల్లమ్మ గూడెం గ్రామానికి చెందిన జక్కల వెంకన్న యాదవ్  గొర్రెలను పెంచుతూ జీవనం సాగిస్తున్నాడు.

ఎప్పటిలాగే మంగళవారం గొర్రెలు మేపుకొచ్చి గ్రామంలోని ఉన్న కొట్టంలో ఉంచాడు. బుధవారం తెల్లవారుజామున వచ్చి చూసే సరికి కుక్కలు దాడి చేసి 12 గొర్రెలను చంపేశాయి.   మృతి చెందిన గొర్రెల విలువ సుమారు రూ. 1.50 లక్షలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు.