మిడ్​డే మీల్స్​వికటించి.. 12 మందికి అస్వస్థత

మిడ్​డే మీల్స్​వికటించి.. 12 మందికి అస్వస్థత

జడ్పీ హై స్కూల్ లో ఉడకని అన్నం, గుడ్డు 

చండ్రుగొండ, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం పోకలగూడెం జడ్పీ హై స్కూల్ లో మిడ్​ డే మీల్స్ వికటించి సోమవారం 12 మంది స్టూడెంట్స్ అస్వస్థత కు గురయ్యారు. ఈ స్కూల్ లో మొత్తం 147 మంది స్టూడెంట్స్ ఉండగా.. సోమవారం 111 మంది అటెండ్​ అయ్యారు. బాలల దినోత్సవం సందర్భంగా ఆటల పోటీల అనంతరం వారు మిడ్​డే మీల్స్​ చేశారు. రైస్​తో పాటు గుడ్డు, పప్పుచారు పెట్టారు. తిన్న తర్వాత కొంత సేపటికి పలువురు స్టూడెంట్స్ గొంతు నొప్పి, దగ్గుతో పాటు చాతినొప్పి, వాంతులతో ఇబ్బంది పడ్డారు. అన్నం , గుడ్డు సరిగ్గా ఉడకకపోవడం, చారు నీళ్ళలాగా ఉండడంవల్లనే అస్వస్థతకు గురయినట్టు చెప్తున్నారు.

తీవ్ర అస్వస్థతకు గురైన బి.నందిని, కర్ణ, అనురాధ, సిద్దార్థ, హర్ష, సింధు, ఆనంది, గౌతమ్, ఊహాజనని, మహేశ్వరి, కార్తీక్, జానకిలను ఆటోలో చండ్రుగొండ పీహెచ్​సీకి తరలించారు. మెడికల్ ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాశ్ , సిబ్బంది స్టూడెంట్స్ కి వైద్యం అందించారు. ఫుడ్​ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురయ్యారని, వారికి ఎలాంటి ప్రమాదం లేదని మెడికల్ ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు.