
ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని దాడులు చేసినా హెటళ్లు,రెస్టారెంట్లు తమ వైఖరిని మార్చుకోవట్లేదు. పాడైన పోయిన ఆహారం, చాలా రోజులు నిల్వ ఉంచిన మటన్, చికెన్ పెడుతూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. లేటెస్ట్ గా హైదరాబాద్ గోషామహల్ లోని ఓ మటన్ షాపులో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు భారీగా నిల్వ ఉంచిన మటన్ ను సీజ్ చేశారు.
మంగళ్ హాట్ లో ఆఫ్రొజ్ అనే వ్యక్తి A టు Z మటన్ షాప్ నిర్వహిస్తున్నాడు. జీహెచ్ఎంసీ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారుల ఆధ్వర్యంలో దాడులు జరిపారు. పాడైపోయిన మేక, గొర్రెల తలకాయ, కాళ్ళు, బోటీ, లివర్ లను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి.. పెళ్ళిళ్ళు హోటల్స్ కి సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. మొత్తం12 టన్నుల పాడైన మాంసం రికవరీ చేసిన పోలీసులు మటన్ షాప్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు.
చూశారుగా హైదరాబాద్ లో హోటళ్లు, రెస్టారెంట్లలో తింటున్న వారు ఎందుకైనా మంచిది ఒకసారి ఆలోచించండి . బతికుంటే బజ్జీలైనా తినొచ్చు అన్నారు పెద్దలు. కాబట్టి ఇలాంటి నిల్వ చేసిన.. పాడైన ఫుడ్ తిని ప్రాణాలమీదకు తెచ్చుకోకండి.