ఫ్రిడ్జ్​లో స్టోర్​ చేసిన12 టన్నుల మటన్ పట్టివేత

ఫ్రిడ్జ్​లో స్టోర్​ చేసిన12 టన్నుల మటన్ పట్టివేత

మెహిదీపట్నం, వెలుగు: మంగళ్ హాట్ చిస్తి చమాన్​లోని ఓ నాన్ ​వెజ్ ​షాపులో ఫ్రిడ్జ్​లో స్టోర్​చేసిన 12 టన్నుల మేక మాంసాన్ని ఫుడ్​సేఫ్టీ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ సర్కిల్–14 ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు.

మహమ్మద్ అప్రొజ్ (40)అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కొన్నిరోజులుగా ఫ్రిడ్జ్​లో స్టోర్​చేసిన పాయ, తలకాయ, మెదడు, మూత్రపిండం, మేకలు, గొర్రెల కాలేయం కలిసి సుమారు 12 టన్నుల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 8 లక్షలు ఉంటుందని తెలిపారు. ఫ్రిడ్జ్​లో స్టోర్​చేసి తక్కువ ధరకు హోటళ్లు, ఫంక్షన్లకు సప్లై చేస్తున్నట్లు వివరించారు.