12 ఏళ్ల అక్క.. 4 నెలల చెల్లెలిని బావిలో పడేసి చంపేసింది..!

12 ఏళ్ల అక్క.. 4 నెలల చెల్లెలిని బావిలో పడేసి చంపేసింది..!

మనిషి అంటేనే ఈర్శ్య, ద్వేశం, కుళ్లు, కుతంత్రాలు, మంచి, చెడు. ఈ స్వభావాలతో సమాజంలో ఎన్నో ఘటనలు జరుగుతుంటాయి. ప్రతిరోజు ఎన్నో దారుణ ఘటనలను చూస్తుంటాం. అయితే అవి పెద్దవాళ్లలోనే ఎక్కువగా ఉంటాయనేది సహజం. కానీ ఇంకా ప్రపంచం అంటే ఏంటో తెలియని పిల్లల్లో కూడా ఈ దారుణ లక్షణాలు పొడచూపడం ఆందోళనకు గురిచేస్తోంది. పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నా అవి చిన్న చిన్న వస్తువులు, ఆహార పదార్థాల వరకే పరిమితం అవుతాయి కానీ.. ముక్కు పచ్చలారని చిన్నారిని చంపేంతగా కౌమారదశలో ఉన్న పిల్లల్లో ఉండటం బాధాకరం. తాజాగా 4 నెలల చిన్నారిని 12 ఏళ్ల అక్క కేవలం కుళ్లు, ఈర్శ్యతో బావిలో పడేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని కన్నూర్ జిల్లాలో జరిగింది ఈ షాకింగ్ ఇన్సిడెంట్. ఒక 12 ఏళ్ల బాలిక తన బాబాయి కూతురును బావిలో పడేసి చంపేయడం సంచలనంగా మారింది. పరక్కల్ లోని పప్పినిస్సేరి గ్రామంలో ముత్తు, అక్కమ్మ దంపతుల ఇంట్లో జరిగింది. 

ముత్తు, అక్కమ్మ దంపతుల 4 నెలల పాపను వారు పెంచీ చదిస్తున్న 12 ఏళ్ల అమ్మాయి చంపేసింది. ఎవరూ లేరని చేరదీసి అన్నీ తామై చదివిస్తుంటే.. చివరికి మాకు కడుపుకోత మిగిల్చిందని అంటున్న వారి ఆవేదన వర్ణనాతీతం. పాప వాళ్ల నాన్న చనిపోవడంతో, తల్లి ఆ కుటుంబం నుంచి విడిగా ఉంటోంది. తల్లి పట్టించుకోకపోవడంతో తామే ఆలనా పాలనా చూస్తూ చదివిస్తున్నామని ఆ పాప బాబాయ్ చెప్పారు.

‘‘చిన్నారిని హత్య చేసిన పాపను అదుపులోకి తీసుకున్నామని, పాప 7వ తరగతి చదువుతున్నట్లు ఎస్సై బి.కార్తీక్ చెప్పారు. రాత్రి పడుకున్నాక డోర్ తెరిచి ఉందని, వాష్ రూమ్ లో ఉందని, చిన్నారిని బావిలో పడేసి వాష్ రూమ్ కి వెళ్లినట్లు ముత్తు కుటుంబం అనుమానిస్తుందని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రుల ప్రేమ పొందని అమ్మాయి.. చిన్నారిని తన పిన్ని, బాబాయ్ చూసుకుంటున్న ప్రేమానురాగాలను చూసి ఈర్శ్య తోనే ఈ పని చేసినట్లు చెప్పారు. 

ALSO READ | వాకింగ్ చేస్తుండగా..కరెంట్ స్తంభం మీదపడి నాలుగు నెలల గర్భిణి మృతి

అయితే ఈ మర్డర్ లో భిన్న వాదనలు ఉన్నాయని, విచారణ పూర్తయితేగానీ ఏం జరిగిందో చెప్పలేమని సీఐ తెలిపారు. అయితే తాను వాష్ రూమ్ కి వెళ్లి వచ్చే సరికి చిన్నారి బెడ్ పైన లేదని పోలీసులకు చెప్పింది పాప. వాష్ రూమ్ కు వెళ్లినపుడు తన పిన్ని పక్కనే పడుకుని ఉందని, వచ్చి చూసే సరికి అక్కడ లేదని పాప చెప్పినట్లు ఫస్ట్ స్టేట్ మెంట్ నమోదు చేశారు పోలీసులు. బావిలో నుంచి చిన్నారి డెడ్ బాడీని రికవర్ చేసి అంతిమ సంస్కారాలు చేశారు పోలీసులు.