జగిత్యాల జిల్లా రూరల్ మండలం దరూర్లో ఓ బాలిక కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను గుర్తుతెలియని ఓ నలుగురు వ్యక్తులు కారులో వచ్చి ఎత్తుకెళ్లారు. అయితే కారులో ఆ నలుగురు ఫోన్ లో మాట్లాడుతుండగా బాలిక చాకచక్యంగా కారులో నుంచి దూకేసి.. వారి నుంచి తప్పించుకుంది. ఆ తరువాత తన తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం అందించింది. స్థానికుల సహాయంతో ఇంటికి చేరుకుంది.
ఆ తరువాత బాలిక కుటుంబ సభ్యులు జగిత్యాల రూరల్ పోలీసులకు పిర్యాదు చేశారు. బాలికను ఎందుకు ఎత్తుకెళ్లారన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. బాలిక తండ్రి మెకానిక్ గా పనిచేస్తున్నాడు. కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న బాలికను పోలీసులు ప్రశంసించారు.