సెస్ ఎన్నికల్లో బాలుడు ఓటు వేయడం వివాదాస్పదంగా మారింది. నర్సింహుల పల్లె గ్రామానికి చెందిన ఓ 12 ఏండ్ల బాలుడు ఓటు వేశాడు. అతని పేరుపై ఓటర్ స్లిప్ కూడా జారీ చేశారు. అందులో సదరు బాలుడి వయసు 12ఏండ్లుగా ఉండటం విశేషం. మైనర్ కు సిరా గుర్తు పెట్టిన ఫొటోలు వైరల్ గా మారాయి.
నర్సింహులు పల్లెలో బాలుడు ఓటు వేసిన ఘటనపై సెస్ ఎన్నికల అధికారి స్పందించారు. ఓటు హక్కు లేని బాలుడిని పోలింగ్ స్టేషన్ లోకి అనుమతించడం, ఓటు వేసేందుకు పర్మిషన్ ఇచ్చిన సిబ్బందిపై అధికారులు విచారణకు ఆదేశించారు. బాలుడి ఓటును ఇన్ వాలిడ్గా ప్రకటిస్తామని చెప్పారు.