BSNL: బంపర్ ఆఫర్.. రోజుకు రూ.5 తో ఇయర్లీ ప్లాన్.. ఫ్రీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, ఇంకా మరెన్నో..

BSNL: బంపర్ ఆఫర్.. రోజుకు రూ.5 తో ఇయర్లీ ప్లాన్.. ఫ్రీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, ఇంకా మరెన్నో..

రోజు రోజుకూ పెరుగుతున్న రీచార్జ్ ప్లాన్స్ కాస్ట్ భరించలేక ఇబ్బంది పడుతున్న కస్టమర్స్ కోసం BSNL బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒకవైపు ప్రైవేట్ సంస్థలైన ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్.. రోజు రోజుకూ రీచార్జ్ ప్లాన్స్ కాస్ట్ పెంచుతూ కస్టమర్స్ ను ఆందోళనకు గురిచేస్తున్న సమయంలో.. ఏం పర్లేదు.. బీఎస్ఎన్ఎల్ అండగా ఉంది. అతి తక్కువ ధరలతో మీకు సేవలు అందిస్తాం అన్నట్లుగా అద్భుతమైన ప్లాన్ తో ముందుకు వచ్చింది.  కేవలం రోజుకు 5 రూపాయలతో ఇయర్లీ ప్లాన్ తీసుకొచ్చి కస్టమర్స్ కు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 

కాస్ట్లీ రీచార్జ్ ప్లాన్స్ తో విసిగి పోతున్న కస్టమర్స్ సమస్యలు తీర్చేందుకు ఇప్పటికే BSNL 45 రోజుల నుంచి 425 రోజుల ప్లాన్స్ అమలు చేస్తోంది. తాజాగా మరో ఇయర్లీ ప్లాన్.. అన్ లిమిటెడ్ కాల్స్, మెసేజెస్, డాటా ప్యాక్ తో కూడిన ఇయర్లీ  కాంబోను ఇంట్రడ్యూస్ చేసింది. 

తాజాగా 365 రోజుల (ఇయర్లీ ప్లాన్)తో కస్టమర్స్ కు నెల నెలా రీచార్జ్ చేసుకునే ఇబ్బంది లేకుండా అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ప్రకారం అన్ లిమిటెడ్ STD కాల్స్ ను ఎంజాయ్ చేయవచ్చు. టెలికామ్ ఇండస్ట్రీలోనే అతితక్కువ ధరకే లభించే రీచార్జ్ ప్లా్న్ గా చెప్పవచ్చు.

Why bother with monthly recharges when you can enjoy seamless connectivity for a whole year?

With BSNL, get unlimited calls, 600GB of high-speed data, 100 SMS per day, and 365 days of uninterrupted service—all for just ₹1999.

Recharge Now: https://t.co/OlK8NMwIdKpic.twitter.com/5V5ZBDnwXu

— BSNL India (@BSNLCorporate) March 22, 2025

ఏడాదికి 1999 రూపాయలతో రీచార్జ్ చేయిస్తే అన్ లిమిటెడ్ కాల్స్, 600GB హైస్పీడ్ డేటా, రోజుకు 100 SMS లు అందుబాటులో ఉంటాయి. అంటే ఈ ప్లాన్ ప్రకారం రోజుకు యావరేజ్ గా 6 రూపాయల కంటే తక్కువ ఖర్చు అవుతుంది. ఆల్మోస్ట్ 5 రూపాయలతో ఈ ప్యాక్ అందుబాటులోకి తెచ్చింది BSNL . ఎక్కువ ఇంటర్నెట్ అవసరం లేకుండా, అన్ లిమిటెడ్ కాల్స్ ఎంజాయ్ చేసే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆఫర్ అని చెప్పవచ్చు. 

ALSO READ | Money News : క్రెడిట్ కార్డును ఏయే సందర్భాల్లో వాడాలి.. టైంకి తిరిగి కట్టలేకపోతే ఏం చేయాలి.. లాభాలు.. నష్టాలు ఇలా..!