మల్లన్నసాగర్ పంప్ హౌజ్ ను .. సందర్శించిన మహారాష్ట్ర రైతులు

తొగుట, వెలుగు :  సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని తుక్కపుర్ వద్ద నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పంప్ హౌజ్ ను మహారాష్ట్ర కు చెందిన 120 మంది రైతులు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రాజెక్ట్ లను నిర్మాణం చేయడం సంతోషంగా ఉందన్నారు.

కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్ సీ  హరిరాం, ఎస్ సీ బస్వరాజ్, ఈఈ సాయి బాబా, డీ ఈఈ శ్రీనివాస్ రావు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.