- భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ డాక్టర్ వినీత్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న 120 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. గతనెల 28న ఓ వెహికల్లో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో టేకులపల్లి ఎస్సై రమణారెడ్డి తన సిబ్బందితో కలిసి స్టేషన్ ఎదుట రోడ్డుపై నిఘా పెట్టారు.
వెహికల్స్ చెక్ చేస్తుండగా గంజాయి ఉన్న వెహికల్‌ను సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద డ్రైవర్ వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పటి నుంచి వెహికల్ అక్కడే ఉండడం, ఎవరూ రాకపోవడంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసుల ట్రక్‌ను తెరిచి చూశారు. అందులో మూడు ఇనుప బీరువాలు ఉన్నట్టుగా గుర్తించారు. రెండు బీరువాలు తెరిచి చూడగా ఖాళీగా ఉన్నాయి. వాటి వెనుక ఉన్న మరో బీరువాను తెరిచి చూడగా రూ. 30లక్షల విలువైన120కేజీల గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి.
వెహికల్నంబర్ఆధారంగా విచారించగా కర్నాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన మహ్మద్ షకీల్‌కు చెందిన వాహనంగా గుర్తించారు. కొద్ది రోజుల కిందట తనకు తెలిసిన డ్రైవర్మజార్ అనే వ్యక్తికి వెహికల్‌ను కిరాయికి ఇచ్చినట్టుగా యజమాని తెలిపారు. పరారీలో ఉన్న డ్రైవర్ మజార్కోసం వెతుకుతున్నామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.