120 టన్నుల రేషన్​బియ్యం పట్టివేత

120 టన్నుల రేషన్​బియ్యం పట్టివేత
  •      రైస్ మీల్ సీజ్, ఓనర్​పై కేసు

బాల్కొండ వెలుగు: వేల్పూర్ మండల కేంద్రంలోని వజ్ర ఇండస్ట్రీస్ రైస్ మిల్​లో భారీగా రేషన్ బియాన్ని పట్టుకున్నారు. మిల్లులో అక్రమ నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో సీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు శనివారం అర్ధరాత్రి ఎన్ ఫోర్స్ మెంట్ ఏసీపీ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఎన్ ఫోర్స్ మెంట్, టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. 

మిల్లులో అక్రమంగా దాచిన 120 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. మిల్లును సీజ్​చేసి, యజమాని కృష్ణాగౌడ్ పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్​ఓఎస్ డీ శ్రీధర్ రెడ్డి, సివిల్ సప్లయ్​ డిప్యూటీ తహసీల్దార్​ వినోద్ శ్రీనివాస్, ఆర్ఐ మహేశ్​ తదితరులు పాల్గొన్నారు.