న్యూ ఇండియా బ్యాంక్ ఫ్రాడ్: రూ.122 కోట్ల ఫండ్ను ఎలా నొక్కేశారంటే..

 న్యూ ఇండియా బ్యాంక్ ఫ్రాడ్: రూ.122 కోట్ల ఫండ్ను ఎలా నొక్కేశారంటే..

న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ లో ఫిబ్రవరి నెలలో వెలుగు చూసిన ఫ్రాడ్ లో ఆశ్చర్యపోయే విషయాలు బయటపడుతున్నాయి. మొత్తం 122 కోట్ల ఫ్రాడ్ పై ముంబై ఎకానమిక్స్ ఆఫెన్స్ వింగ్ (EOW) విభానికి చెందిన పోలీసులు మరింత పురోగతిని సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు మనోహర్ అరుణాచలం, అతని అనుచరులు ఉల్హనాత్ అరుణాచలం, మిగితా  సభ్యులు దాదాపు 40 కోట్ల రూపాయలను వివిధ అకౌంట్ల నుంచి మళ్లించినట్లు గుర్తించారు. 

కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి నొక్కిన ఫండ్ ను లక్జరీ అపార్ట్ మెంట్లలో ఫ్లాట్స్ కొనేందుకు, అదే విధంగా తమ పేరున ఉన్న కంపెనీలకు మళ్లించారు. అంతే కాకుండా కొన్ని ట్రస్టులకు ట్రాన్స్ఫర్ చేసి.. ఆ తర్వాత తమ అకౌంట్లలోకి మళ్లించే ప్లాన్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

మొత్తం రూ.122 కోట్లలో 40 కోట్లు హ్యాండ్ ఓవర్ చేసే ముందే కొంత మొత్తాన్ని హితేశ్ మెహతాకు ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని గోద్రేజ్ రిజర్వ్ ప్రాజెక్ట్ లో ఫ్లాట్స్ బుక్ చేసేందుకు వినియోగించినట్లు గుర్తించారు. అయితే మెహతాకు ఎంత మొత్తం ట్రాన్స్ఫర్ చేశారనేది ఇంకా స్పష్టంగా చెప్పలేదు. 

Also Read : బ్లూస్టార్​ నుంచి 150 ఏసీ మోడల్స్​

అదేవిధంగా పరారీలో ఉన్న కపిల్ దేదియా, హితేశ్ మెహతా అకౌంట్లలోకి అనామక అకౌంట్ల నుంచి  ఫండ్ ట్రాన్స్ఫర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ ట్రాన్జాక్షన్స్ ఎక్కడి నుంచి జరిగాయనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. 

మెహతా నుంచి రూ.40 కోట్లు రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ అమౌంట్ ను తన కంపెనీ మాగాస్ కన్సల్టెన్సీలో తన అనుచరుల ద్వారా డిపాజిట్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. మిగతా అమౌంట్ ఇతర ట్రస్టులకు పంపించినట్లు గుర్తించారు. అది ఏ ఏ ట్రస్టులకు వెళ్లిందనేది తెలియాల్సి ఉంది.