కాగజ్ నగర్‌‌లో పనిచేయని సీసీ కెమెరాలు

కాగజ్ నగర్‌‌లో పనిచేయని సీసీ కెమెరాలు

కాగజ్ నగర్, వెలుగు:  కాగజ్ నగర్ పట్టణంలో ఉన్న 125 సీసీ కెమెరాలు పని చేయడం లేదు. పట్టణంలోని 30 వార్డుల్లో మొత్తం 65 వేల మంది నివసిస్తున్నారు. మెయిన్ రోడ్, గల్లీల్లో కలిపి మొత్తం 125  సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.  కేవలం ప్రైవేటు షాపు నిర్వాహకులు, యాజమానులు పెట్టుకున్న కెమెరాలు మాత్రమే పని చేస్తున్నాయి. మూడు నెలల్లో పట్టణంలో పలు దొంగతనాలు జరగ్గా నిందితులను పట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్‌‌‌‌లో వరుస దొంగతనాలు కలవరపెడుతున్నాయి. 

మహిళలను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తున్నారు. పట్టణంలో ఉన్న సీసీ కెమెరాలను పోలీస్ స్టేషన్ కు అనుసంధానం చేసినా.. అవి పని చేయకపోవడంతో దొంగల్ని పట్టుకోవడంతో ఇబ్బంది కలుగుతోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సీసీ కెమెరాలు బాగు చేయాలని కోరుతున్నారు.