ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో మళ్లీ దేశాలు ఆంక్షల బాట పట్టాయి. ఈ క్రమంలో తాజాగ ఇటలీ నుంచి వచ్చిన ఓ విమానంలో ప్రయాణికులంతా వైరస్ బారిన బడ్డారు. ఫ్లైట్ లో 125 మంది ప్రయాణికులు టెస్ట్ చేస్తే పాజిటివ్ అని తేలింది. వివరాల్లోకి వెళ్తే.. ఇటలీ నుంచి పంజాబ్ అమృత్ సర్ కు వచ్చిన విమానంలో 125మందికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని అమృత్ సర్ ఎయిర్ పోర్టు వీకే సేథ్ తెలిపారు. ఫ్లైట్ లో మొత్తం 179 మంది ఇటలీ నుంచి వస్తే. వారిలో 125 మందికి వైరస్ సోకింది. మరోవైపు భారత్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇవాళ కేసుల సంఖ్య 90 వేలు దాటింది. తాజాగా 90,928 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
325 మరణాలు నమోదు అయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 2,85,401 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 0.81శాతంగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటి రేటు 6.43 శాతానికి చేరుకుంది. దేశంలో ఇప్పటివరకు 3,51,09,286 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 4,82,876 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో 97.81 శాతంగా కరోన రికవరీ రేటు ఉంది. నిన్న 19,206 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 3,43,41,009 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఇవి కూడా చదవండి:
రానున్న రోజుల్లో 90 శాతం ఒమిక్రాన్ కేసులు
తెలంగాణ పోలీసులు పింక్ డ్రెస్ వేసుకోవాలి