తెలంగాణలో మరో 1256 కరోనా కేసులు

తెలంగాణలో మరో 1256 కరోనా కేసులు

తెలంగాణలో మరో 1256 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 11,609 పరీక్షలు చేస్తే.. వాటిలో 1256 కేసులు పాజిటివ్ గా వచ్చాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 80,751కి చేరుకుంది. కరోనా బారినపడి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారు 1587గా ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 57,586గా నమోదయింది. అయితే కరోనా బారినపడి ఆదివారం 10 మంది మరణించారు. దాంతో రాష్టంలో మొత్తం మరణాల సంఖ్య 637గా నమోదయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,528 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని.. 15,789 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారని ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో రికవరీ రేటు ప్రస్తుతం 71.31 శాతంగా ఉంది. ఇది దేశ సగటు 68.78 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలో చేసిన కరోనా పరీక్షల సంఖ్య 6,24,840కు చేరుకుంది.

ఇక జిల్లాల విషయానికొస్తే.. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 389, రంగారెడ్డి 86, సంగారెడ్డి 74, కరీంనగర్ 73, వరంగల్ అర్బన్ 67, ఆదిలాబాద్ 63, నల్గొండ 58, సిద్ధిపేట్ 45, నాగర్ కర్నూల్ లో 38 కేసులు నమోదయ్యాయి.

For More News..

కేరళ విమాన ప్రమాదం తర్వాత మళ్లీ మొదలైన వందే భార‌త్ మిష‌న్

మరోసారి డిఫరెంట్‌‌గా వస్తున్న నాని

వ్యవసాయ కూలీలకు ఫుల్ డిమాండ్