రామగుండం బల్దియాకు రూ.126 కోట్ల మంజూరు

  • ఖనిలో కాంగ్రెస్​ శ్రేణుల సంబరాలు

గోదావరిఖని, వెలుగు: రామగుండం బల్దియా అభివృద్ధికి వివిధ మార్గాల ద్వారా రూ.126కోట్లు మంజూరయ్యాయి. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం గోదావరిఖనిలో కాంగ్రెస్  శ్రేణులు సంబురాలు నిర్వహించారు. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, ఎమ్మెల్యే రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఠాకూర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. సీఎం గ్రాంట్స్​ నుంచి రూ.10 కోట్లు, డీఎంఎఫ్​టీ నుంచి రూ.16  కోట్లు, మున్సిపల్​ గ్రాంట్స్​ కింద రూ.100 కోట్లు మంజూరైనట్లు లీడర్లు తెలిపారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ బీఆర్ఎస్​ పాలనలో రామగుండం ప్రాంతాన్ని విస్మరించారని విమర్శించారు.

రామగుండం బల్దియా అభివృద్ధికి నిధులు విడుదల చేయించిన ఘనత ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్​కే దక్కిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నగర కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు బొంతల రాజేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాల్వ లింగస్వామి, మహంకాళి స్వామి, ఎండీ ముస్తఫా, పెద్దెల్లి ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రవి, మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాజేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.