![కామారెడ్డి జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 1289 పోలింగ్ కేంద్రాలు](https://static.v6velugu.com/uploads/2025/02/1289-polling-stations-for-mptc-and-zptc-elections-in-kamareddy-district_lF6SAUxmhj.jpg)
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన డ్రాప్ట్ పోలింగ్ కేంద్రాల జాబితా మంగళవారం రిలీజ్ అయింది. . 25 మండలాల్లో మొత్తం 1,286 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ పోలింగ్ కేంద్రాలపై 13 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు.
13న రాజకీయ పార్టీల ప్రతినిధులతో మీటింగ్ ఉంటుంది. అభ్యంతరాలపై చర్చించాలి. వాటిపై 14న తుది జాబితా నిర్ణయం ప్రకటిస్తారు. మండలాల వారీగా ఫైనల్ పోలింగ్ కేంద్రాలను 15న ప్రకటించనున్నారు.