
కిన్షాసా(కాంగో): జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తొక్కిసలాట జరిగి కాంగోలో 129 మంది ఖైదీలు మరణించారు. వీరిలో 24 మంది తుపాకీ కాల్పుల్లో చనిపోయారని ప్రాథమిక అంచనా. సోమవారం కిన్షాసాలోని మకాల సెంట్రల్ జైలులో ఈ ఘటన జరిగింది. మంగళవారం ఇంటీరియర్ మినిస్టర్ జాక్వెమిన్ షబానీ ట్వీట్ చేశారు. ‘‘మకాల జైలు నుంచి తప్పించుకునేందుకు ఖైదీలు ప్రయత్నించారు.
దీంతో తొక్కిసలాట జరిగి మొత్తంగా129 మంది ఖైదీలు మరణించారు. మరో 59 మంది గాయపడ్డారు. కొంతమంది మహిళలు రేప్‌కు కూడా గురయ్యారు” అని తెలిపారు. ఈ ఘటనపై జస్టిస్ మినిస్టర్ కాన్ స్టంట్ ముతాంబా స్పందించారు. పక్కా ప్లాన్‌తోనే కొంతమంది ఖైదీలు మిగతా వారిని రెచ్చగొట్టి తప్పించుకునే ప్రయత్నం చేశారని చెప్పారు.