750 రూపాయలు కట్టండి.. లక్షాధికారి కండి.. కోట్లకు మోసం చేసిన ఇంటర్ స్టూడెంట్

750 రూపాయలు కట్టండి.. లక్షాధికారి కండి.. కోట్లకు మోసం చేసిన ఇంటర్ స్టూడెంట్

రాజస్థాన్ లో ఓ ఇంటర్ పాసైన యువకుడు భారీ మోసానికి పాల్పడ్డాడు. కేవలం రూ. 750 కట్టి లక్షాధికారి కండి అంటూ వేల మంది జనాలను దోచుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. రూ. 750 స్కీం అంటూ ఆన్లైన్లో జనాలకు ఎర వేసి.. 18 నెలల్లోనే కోట్లు సంపాదించాడు సదరు యువకుడు. అయితే.. మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించటంతో ఈ ఘరానా మోసం గుట్టు రట్టయ్యింది.

బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు తెలిశాయి. నిందితుడి అకౌంట్ కి సుమారు కోటి రూపాయలకు పైగా లావాదేవీలు జరిగినట్లు తెలిసింది. ఈ మోసంపై మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఫిర్యాదులు వచ్చాయని పోలీసులు తెలిపారు.

ALSO READ | ఆధార్ కార్డు పేరుతో.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుండి రూ.12 కోట్లు కొట్టేశారు

ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ వచ్చే ఫోన్ కాల్స్, ఈమెయిల్స్, మెసేజ్ లను నమ్మొద్దని తెలిపారు పోలీసులు. మెసేజ్ లో వచ్చిన లింకులు ఎట్టి పరిస్థితిలో క్లిక్ చేయద్దని... ఫోన్ కాల్స్ లో ఓటీపీలు చెప్పొద్దని సూచిస్తున్నారు పోలీసులు.