బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss Season7)లో 12వ వారం ఎలిమినేషన్ కు రంగం సిద్దమయ్యింది. అయితే ఈ వారం కాస్త డిఫరెంట్ గా డబల్ ఎలిమినేషన్ ఉండనుంది. గత వారంమే హోస్ట్ నాగార్జున డబల్ ఎలిమినేషన్ గురించి హింట్ ఇచ్చేశారు. ఎందుకంటే.. గత వారంలో ఎవరిని ఇంటినుండి బయటకు వెళ్ళలేదు కాబట్టి. దేంతో ఈవారం ఎలిమినేషన్ పై ఆసక్తి నెలకొంది. ఆడియన్స్ కూడా ఈవారం ఎలిమినేష కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇక ఈవారం నామినేషన్స్ లో ప్రియాంక, శోభా తప్పా అందరూ ఉన్నారు. అందులో ఎప్పటిలాగే పల్లవి ప్రశాంత్ టాప్ ఓటింగ్ తో దూసుకుపోతున్నాడు. ఓటింగ్ లో అతనికి 35% వరకు పడుతున్నాయి. ఇక ఆతరువాత పొజిషన్ లో అమర్ డీప్ ఉన్నారు. గతవారం, ఈవారం కెప్టెన్సీ టాస్కులో ఎమోషనల్ అవటంతో అమార్ కు భయంకరంగా ఓటింగ్ పెరిగింది. ప్రస్తుతం అమర్ 32% ఓటింగ్ తో స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నారు. తరువాతి స్థానంలో శివాజీ ఉన్నారు. కారణం గత రెండు వారాలుగా ఆయన గ్రాఫ్ చాలా పడిపోయింది. మొన్నటివరకు టాప్ లో ఉన్న శివాజీ ప్రస్తుతం మూడవ పొజిషన్ లో ఉన్నారు. కారణం ఆయన అమర్ ను టార్గెట్ చేయడమే.
ఇక తరువాతి స్థానాల్లో గౌతమ్,యావర్,అర్జున్,రతిక ఉన్నారు. ఈ నలుగురిలో అర్జున, రతిక డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇప్పటికే అశ్విని ఎలిమినేషన్ ఫిక్స్ అవగా.. తనతో పాటు డబల్ ఎలిమినేషన్ కోసం అర్జున్,రతిక పోటీ పడుతున్నారు. ఇక్కడ ఒక ట్విస్టు ఇవ్వనున్నాడు బిగ్ బాస్. అదేంటంటే.. పల్లవి ప్రశాంత్ దగ్గర ఏవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి.. అర్జున్, రతిక డేంజర్ జోన్ లో ఉన్నప్పుడు బిగ్ బాస్ ఏవిక్షన్ ఫ్రీ గురించి పల్లవి ప్రశాంత్ ను అడుగుతారు. ఆ సమయంలో ప్రశాంత్ తన ఏవిక్షన్ ఫ్రీ పాస్ ను అర్జున్ కోసం వాడే అవకాశం ఉంది. ఎందుకంటే.. రీ ఎంట్రీలో రతిక పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేసింది కాబట్టి. అంతేకాదు వరుసగా రెండు వారాల నుండి ప్రశాంత్ ను నామినేషన్స్ లోకి తెచ్చింది రతిక. ఏవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల అర్జున్ సేవ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో 12వ వారం డబల్ ఎలిమినేషన్ లో భాగంగా రతిక, అశ్విని హౌస్ నుండి బయటకు రానున్నారు.