న్యూఢిల్లీ: ఐపీఓ మార్కెట్ కళకళలాడుతోంది. ఈ వారం ఏకంగా 13 కంపెనీలు ఇన్వెస్టర్ల ముందుకొస్తున్నాయి. మెయిన్ బోర్డ్ ఐపీఓలు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, పీఎన్ గాడ్జిల్ జ్యువెలర్స్, క్రోస్ లిమిటెడ్, టొలిన్స్ టైర్స్‌తో పాటు తొమ్మిది ఎస్ఎంఈ ఐపీఓలు కూడా ఈ వారం ఓపెన్ కానున్నాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, క్రోస్ లిమిటెడ్, టొలిన్స్ టైర్స్ ఐపీఓ ఈ నెల 9 న ఓపెనై 11 న ముగుస్తాయి. పీఎన్ గాడ్జిల్ జ్యువెలర్స్ ఐపీఓ ఈ నెల 10 న ఓపెనై 12 న ముగుస్తుంది. ఆర్కేడ్ డెవలపర్స్ ఈ నెల 16 న ఐపీఓకి రావాలని చూస్తుండగా, వెస్టర్న్ క్యారియర్స్ కూడా త్వరలో ఇన్వెస్టర్ల ముందుకొచ్చే ఆలోచనలో ఉంది.
ఎస్ఎంఈ ఐపీఓలు..
ఎస్ఎంఈ ఐపీఓలు ఆదిత్య అల్ట్రా స్టీల్, శుభశ్రీ బయోఫ్యూయల్స్ ఎనర్జీ, షేర్ సామధాన్, గజానంద్ ఇంటర్నేషనల్, ఎస్పీపీ పాలిమర్స్, ట్రాఫిక్సోల్ ఐటీఎస్ టెక్నాలజీస్, ఎక్స్లెంట్ వైర్స్ అండ్ ప్యాకేజింగ్, ఇన్నోమెట్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్, ఎన్విరోటెక్ సిస్టమ్స్ కూడా ఈ వారం ఇన్వెస్టర్ల ముందుకొస్తున్నాయి. ఇవి సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 13 మధ్య అందుబాటులో ఉంటాయి. మొత్తంగా ఈ 13 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.8,644 కోట్లు
సేకరించాలని చూస్తున్నాయి.