కూలీల తరలింపునకు 13 కోట్లు ఖర్చుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు 1.58 లక్షల మంది వలస కూలీలను సొంత రాష్ట్రాలకు తరలించామని, ఇందుకోసం రూ.13.15 కోట్లు ఖర్చు చేశామని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఖర్చులతోనే కూలీలను తరలిస్తున్నామని చెప్పారు. వలస కూలీల తరలింపు ప్రక్రియను సాఫీగా పూర్తి చేసినందుకు అధికారులను అభినందించారు. ఒక్క పశ్చిమ బెంగాల్ కు చెందిన కూలీలు మినహా మిగతా రాష్ట్రాల వారందరినీ దాదాపుగా తరలించామని సీఎస్ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ లో పరిస్థితులు చక్కబడ్డాక, వారిని కూడా తరలిస్తామన్నారు. ఒకట్రెండు రోజుల్లో వారిని పంపేందుకు 10 రైళ్లను సిద్ధంగా ఉంచామన్నారు.

For More News..

కరోనా దెబ్బకు కొనుగోలు తీరు మారింది

విదేశాల్లో దూసుకుపోతున్న ఇండియన్ ఓటీటీలు

12 గంటల్లో 43 ట్రైన్స్‌‌తో రికార్డు