మధ్యప్రదేశ్ రాజ్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడడంతో 13 మంది మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. ఘటనా స్థలంలో పోలీసుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డ వారిని రాజ్ గఢ్ జిల్లా హాస్పిటల్ కు తరలించారు.
వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉండడంతో భోపాల్ కు షిప్ట్ చేశారు. రాజస్థాన్ నుంచి కొందరు ఓ పెళ్లికి హాజరయ్యేందుకు మధ్యప్రదేశ్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు అధికారులు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని వివరించారు.
ట్రాక్టర్ ప్రమాదంపై మధ్యప్రదేశ్ సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదకుంటామని చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన ట్రీట్మెంట్ చేయాలని ఆదేశించారు. మరోవైపు ట్రాక్టర్ ప్రమాదం బాధకరమని ట్వీట్ చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు.