పాలు (ఇండోనేసియా): ఇండోనేసియాలోని నికెల్ తయారీ ఫ్యాక్టరీలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది వర్కర్లు చనిపోయారు. 46 మంది వరకు గాయపడ్డారు. చైనాకు చెందిన ఈ ఫ్యాక్టరీ.. సులవేసి ద్వీపంలో ఉంది. మృతుల్లో నలుగురు చైనీయులు, 9మంది ఇండోనేసియా వర్కర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో నలుగురు చైనీయుల హెల్త్ కండీషన్ సీరియస్‌గా ఉందన్నారు.
పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో బిల్డింగ్ సైడ్ వాల్స్ కూడా దెబ్బతిన్నాయి. ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. కొలిమికి రిపేరు చేస్తున్న టైమ్‌లో కింది నుంచి ఎక్స్‌ప్లోజివ్ లిక్విడ్స్ బయటికొచ్చాయి. దీంతో ఒక్కసారిగా వాటికి మంటలు అంటుకున్నాయి. పక్కనే ఆక్సిజన్ సిలిండర్లు ఉండటంతో భారీ ఎత్తున పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి కొలిమితో పాటు గోడలు బద్దలయ్యాయి. రిపేరు సమయంలో కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఇన్వెస్టిగేషన్ అధికారులు తెలిపారు.