నిర్మల్, వెలుగు: మండీ బిర్యానీ తిన్న పలువురికి ఫుడ్ పాయిజన్ అయి చికిత్స పొందుతున్నారు. నిర్మల్ టౌన్ ఖానాపూర్ రోడ్డులోని గ్రిల్ హోటల్ లో ఆదివారం రాత్రి ఖానాపూర్ కు చెందిన కొందరు.. నిర్మల్ కు చెందిన అస్లాం, హుస్సేన్, షేక్ బాబా, షేక్ జాకీర్, సైఫ్ మండీ చికెన్ బిర్యానీ తిన్నారు.
13 మందికి ఫుడ్ పాయిజన్ అయి.. వాంతులు, విరేచనాలు కావడంతో నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరు సోమవారం మధ్యాహ్నం కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. మరో ఆరుగురు చికిత్స పొందుతున్నారు. చికెన్ బిర్యానీ తినడంతోనే ఫుడ్ పాయిజన్ అయినట్టు బాధితులు, వైద్య సిబ్బంది తెలిపారు