హైదరాబాద్: తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. సోమవారం (అక్టోబర్ 28) 13 మంది ఐఏఎస్‌లను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. నల్గొండ కలెక్టర్‌గా త్రిపాఠి, రంగారెడ్డి కలెక్టర్‌గా నారాయణరెడ్డి, యాదాద్రి కలెక్టర్‌గా హనుమంతరావు, మున్సిపల్ శాఖ డైరెక్టర్‌గా టీకే శ్రీదేవి, సీసీఎల్‌ఏ డైరెక్టర్‌గా మందా మకరందు, ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్‌గా ఎస్.హరీష్, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా దిలీప్‌కుమార్, పర్యాటక శాఖ సంచాలకులుగా జెడ్.కే హనుమంతు, రాష్ట్ర ప్రాధాన్య ప్రాజెక్టుల కమిషనర్‌గా శశాంక, విపత్తు నిర్వహణ సంయుక్త కార్యదర్శిగా హరీష్‌కు అదనపు బాధ్యతలు.. ఆర్ అండ్ ఆర్, భూసేకరణ కమిషనర్‌గా వినయ్ కృష్ణారెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్‌గా నిఖిల్ చక్రవర్తి, డెయిరీ కార్పొరేషన్ ఎండీగా కే.చంద్రశేఖర్ రెడ్డిలను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు 2024, అక్టోబర్ 28న సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ALSO READ : తెలంగాణ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో భారీగా బదిలీలు : 70 మంది అధికారుల ట్రాన్సఫర్లు