ఒమన్లో నౌక ప్రమాదం జరిగింది. యెమెన్ లోని అడెన్ పోర్ట్ కు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ నౌక ఒమన్ తీరంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 16 నౌక సిబ్బంది గల్లంతయ్యారు. వారిలో 13 మంది భారతీ యులు ఉన్నారు. మరో ముగ్గురు శ్రీలంకకు చెందినవారని సుల్తానేట్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ (MSC) తెలిపింది. గల్లంతైన సిబ్బందిని ఆచూకీకోసం రెస్య్కూ టీంలు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రెస్టీజ్ ఫాల్కన్ అనే కొమొరోస్ జెండాతో నడిచే ఈ ఆయిల్ ట్యాంకర్ నౌకలో 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలకం వాసులు ఉన్నట్లు కేంద్రం గురువారం ట్వీట్ ద్వారా తెలిపింది. సోమవారం ఒమనీ పోర్ట్ ఆఫ్ డుక్మ్ సమీపంలో రాస్ మాద్రాకాకు ఆగ్నేయంగా 25 నాటికల్ మైళ్ల దూరంలో ఓడ బోల్తా పడిందని తెలిపింది.
ALSO READ : ఎయిర్పోర్ట్లో మెకానిక్ ఉద్యోగాలు.. బారులు తీరిన నిరుద్యోగులు..
LSEG షిప్పింగ్ డేటా ప్రకారం.. ఈ నౌక యెమెన్ పోర్టు ఆఫ్ అడెన్ కు వెళుతోంది. సోమవారం (జూలై15,2024) ఒమనీ పోర్ట్ ఆఫ్ డుక్మ్సమపీంలో రాస్ మద్రాకాకు ఆగ్రేయంగా 25నాటికల్ మైళ్ల దూరంలో నౌక బోల్తాపడినట్లు MSC సోషల్ మీడియాలో ధృవీకరంచింది. ఈ నౌక పూర్తిగా మునిగిపోయి తలకిందులుగా ఉండిపోయిందని ఒమన్ సముద్ర భద్రతా కేంద్రం తెలిపింది. 2017 లో నిర్మించిన ప్రెస్టీజ్ ఫాల్కన్ ఓడ.. 117 మీటర్లు పొడవు గల ఆయిల్ ప్రాడక్స్ తీసుకెళ్లే ఆయిల్ ట్యాంకర్. వీటిని చిన్న చిన్న ఎగుమతులకు వినియోగిస్తారు.