ఆసిఫాబాద్ లో 13 మంది ఇంటర్ స్టూడెంట్స్ డిబార్

కాగజ్ నగర్, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరుగుతున్న ఇంటర్​ మొదటి సంవత్సరం పరీక్షల్లో 13 మంది విద్యార్థులు డిబార్​అయ్యారు. ఈ విషయం పై జిల్లా డీఐఈఓ శ్రీధర్ సుమన్ ను వివరణ కోరగా 13 మంది స్టూడెంట్స్ మాస్ కాపీయింగ్ కు పాల్పడుతుండగా ప్రత్యేక స్క్వాడ్ పట్టుకొని డిబార్ చేయడం వాస్తవమేనని, అయితే ఇప్పటివరకు చర్యలపై ఆదేశాలు రాలేదని చెప్పారు.