ఏప్రిల్ 3న 13 ఎక్సైజ్ పోలీస్​స్టేషన్లు ప్రారంభం

ఏప్రిల్ 3న 13 ఎక్సైజ్ పోలీస్​స్టేషన్లు  ప్రారంభం

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఈ నెల 3న ఎక్సైజ్ శాఖ గ్రేటర్ పరిధిలో 13 కొత్త పోలీస్ స్టేషన్లను ప్రారంభించనుంది.  గండిపేట, అమీన్​పూర్ స్టేషన్లను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతులమీదుగా ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.  మిగతా స్టేషన్లను ఆయా ప్రాంతాల్లో ఉన్నతాధికారులు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. 

ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ ఎం. రిజ్వీ, ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ పాల్గొననున్నారు. కాగా, కొత్త ఎక్సైజ్ పోలీస్​స్టేషన్లను 1న ప్రారంభించాలని నిర్ణయించినా జీహెచ్ఎంసీ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 3వ తేదీకి వాయిదా వేశారు.