ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు జరగనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు జరగనున్నఈ టోర్నీకి చైనా ఆతిధ్యమిస్తుంది. ఇక ఈ గేమ్స్ లో పాల్గొనేవారికి ఒక బంపర్ ఆఫర్ లభించింది. ఒకటి కాదు రెండు కాదు క్వాలిఫై అయితే ఏకంగా 10 లక్షలు ఇచ్చేస్తుంది. అయితే ఒడిస్సా ప్లేయర్స్ కి మాత్రమే ఈ అవకాశం వచ్చింది. చైనాలోని హాంగ్‌జౌలో జరగనున్న ఆసియా క్రీడలు 2022లో పాల్గొనే 13 మంది రాష్ట్ర అథ్లెట్లకు ఒడిశా ప్రభుత్వం బుధవారం ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.
ఒడిస్సా నుంచి ఆసియా క్రీడల్లో 13 మంది ఒడిశా క్రీడాకారులు పోటీ పడనున్నారు. అథ్లెటిక్స్‌లో కిషోర్ జెనా, రోయింగ్‌లో అన్షికా భారతి, రీతు కౌడి, సోనాలి స్వైన్, జు-జిట్సులో అనుపమ స్వైన్, కయాకింగ్ మరియు కెనోయింగ్‌లో నేహా దేవి లీచోండమ్, ఫుట్‌బాల్‌లో ప్యారీ క్సాక్సా, దీప్ గ్రేస్ ఎక్కా, అమిత్ రోహిదాస్ ఉన్నారు. హాకీ,రగ్బీలో దుముని మార్ండి, తరులతా నాయక్, మామా నాయక్ హుపి మాఝీ ఈ బంపర్ ఆఫర్ కొట్టేశారు.
Also Read:- ముగ్గురు మొనగాళ్లు: ఐసీసీ ర్యాంకుల్లో భారత బ్యాటర్ల హవా
ఈ సందర్భంగా ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ " అథ్లెట్లు ఆటలలో తమ ప్రతిభను ప్రదర్శిస్తారని ఈ ప్రోత్సాహకం వారి శిక్షణ మరియు ప్రదర్శనపై మాత్రమే దృష్టి పెట్టడానికి వారికి శక్తినిస్తుంది" అని ఆశాభావం వ్యక్తం చేశారు. సాధారణంగా గెలిస్తే ఇంత భారీ మొత్తంలో నజరానా వస్తుంది. కానీ అథ్లెట్స్ ని ప్రోత్సహించడానికి ముందుగానే 10 లక్షల మనీ అందజేయడం చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
Thirteen athletes from Odisha will participate in the 2023 Asian Games ?#AsianGames2023 #Odisha #NaveenPatnaik #SportsNews pic.twitter.com/Buqh44O6oy
— InsideSport (@InsideSportIND) September 13, 2023