కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో జూనియర్ పంచాయతీ సెక్రెటరీలుగా 4 ఏండ్లు కంప్లీట్ చేసుకున్న వారికి గ్రేడ్-4 పంచాయతీ సెక్రెటరీలుగా 13 మందికి రెగ్యులర్ ఆర్డర్‌లు బుధవారం ఇచ్చారు. గతంలో జేపీఎస్‌లు నియమితులైన వారికి రెగ్యులర్ పోస్టులు ఇచ్చారు. కొందరు 4 ఏండ్లు కంప్లీట్ చేసుకొక అప్పట్లో రెగ్యులర్ పోస్టులు ఇవ్వలేదు.
ఇప్పుడు 13 మంది కి కంప్లీట్ కావటంతో రెగ్యులర్ పోస్టులు ఇచ్చారు. వీరు అడిషనల్ కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, వి.విక్టర్లను కలిసి కృతజ్నతలు తెలిపారు. డీపీవో శ్రీనివాస్‌రావు, డీఎల్పీవోలు తదితరులు ఉన్నారు.