కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మృతిచెందారు. తుమ్కూరు జిల్లా.. బలడ్కేర్ వద్ద బెంగుళూరు, మంగుళూర్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ధర్మస్థల్ నుంచి వస్తున్ననలుగురు యువకుల బ్రెజా కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. అదే సమయంలో తమిళనాడు నుంచి వస్తున్న టవేరా కారు.. పల్టీలు కొట్టిన కారును బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు కార్లలో ప్రయాణిస్తున్న మొత్తం 13 మంది అక్కడికక్కడే చనిపోయారు. చనిపోయిన 4 కర్ణాటకు చెందినవారు కాగా.. 9 మంది తమిళనాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
For More News..