భిక్కనూరు సర్కారు దవాఖానాలో 13 పోస్టులు ఖాళీ

భిక్కనూరు సర్కారు దవాఖానాలో 13 పోస్టులు ఖాళీ

భిక్కనూరు, వెలుగు: భిక్కనూరు మండలంలోని సర్కారు ఆసుపత్రిలో మొత్తం13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముగ్గురు డాక్టర్లు మాత్రమే డ్యూటీలో ఉన్నారు. మరో ఇద్దరు చంద్రమౌళి, ఆదిత్య మాచారెడ్డికి డిప్యూటేషన్ పై వెళ్లారు.  పల్లె దవాఖానల్లో భిక్కనూరు 1, 2 లలో ఇద్దరు ఎఎన్ఎంలు, కాచాపూర్, బస్వాపూర్, ఇసాన్న పల్లిలోని పల్లె దవాఖానాలో ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టు, స్వీపర్, డ్రైవర్ మొత్తం గా 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా ప్రజలు జ్వరాల బారిన పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.