రాజన్న సిరిసిల్లలో కరెంట్ షాక్‌‌‌‌తో 13 గొర్రెలు మృతి

రాజన్న సిరిసిల్లలో కరెంట్ షాక్‌‌‌‌తో 13 గొర్రెలు మృతి

ముస్తాబాద్‌‌‌‌, వెలుగు :  కరెంట్ షాక్ తో గొర్రెలు చనిపోయిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు లో జరిగింది. బాధితుడు బత్తుల మల్లేశం తెలిపిన మేరకు.. గొర్రెల మంద చుట్టూ రక్షణకు ఇనుప ఫెన్సింగ్ వేయించాడు. అదే మందపై నుంచి అతనికి ఇంటికి కరెంట్ తీగ వెళ్తుంది. మంగళవారం రాత్రి ఆ తీగ తెగి ఫెన్సింగ్‌‌‌‌పై పడడంతో కరెంట్‌‌‌‌ సప్లై కాగా.. 

షాక్‌‌‌‌ కొట్టడడంతో గొర్రెలు అరుస్తుండగా.. మల్లేశం ఇంట్లోంచి బయటకు వచ్చి చూశాడు.  కరెంట్​తీగను కర్రతో తొలగించేలోపే13 గొర్రెలు మృతిచెందాయి. సుమారు రూ. 2 లక్షల్లోపు నష్టం వాటిల్లింది. జీవనాధారమైన గొర్లు చనిపోయాయని తనను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు.