వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లాలో శుక్రవారం ఒక్క రోజే 9 రకాలకు చెందిన 13పాములను పట్టుకొని అడవిలో వదిలేసినట్లు సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు, హోంగార్డు కృష్ణసాగర్ తెలిపారు.3 నాగుపాములు, 2 జెర్రిపోతులు, ఒక్కో నూనెకట్లపాము, నీరుకట్ట, రక్తపింజరి
పూడుపాము, డ్రింకేట్, కొండచిలువ, చెడుగుపాము, ఉల్ఫ్స్నేక్ ఉన్నట్లు పేర్కొన్నారు. పాములను చంపకుండా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. జింక మోహన్, మెట్టుపల్లి ఆంజనేయులు, గోపాల్, దేవేందర్ ఉన్నారు.